గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: మంగళవారం, 2 జులై 2019 (17:40 IST)

లక్ష్మీపార్వతి-పూనంలను వేధించిన కోటీ: అబ్బే... ఆ కోటి భాజపా సభ్యుడు కాదు...

ఆమధ్య తనను వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి లైంగికంగా వేధిస్తోందంటూ సోషల్ మీడియాలో కలకలం సృష్టించిన కోటి అనే యువకుడు వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఐతే ఆ యువకుడు హఠాత్తుగా సోమవారం నాడు ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకున్నాడు.

ఐతే దీనిపై సోషల్ మీడియాలో రచ్చరచ్చ కావడంతో భాజపా బెంబేలెత్తిపోయింది. కోటికి భాజపా సభ్యత్వం లేదనీ, అతడు చేరిక జరిగినా అతడికి సభ్యత్వం ఇవ్వలేదని పత్రికా ప్రకటన విడుదల చేసింది. 
 
కాగా కోటీ అనే ఈ వ్యక్తి కొన్ని రోజుల క్రితం తనను వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి లైంగికంగా వేధిస్తోందంటూ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసి వార్తల్లోకి ఎక్కాడు. కాగా అతడు తనపై దుష్ర్పచారం చేసి తన పరువుకి భంగం కలిగించాడంటూ లక్ష్మీపార్వతి తెలంగాణ డిజీపి ఫిర్యాదు చేశారు. ఇతడిపై నటి పూనమ్ కౌర్ కూడా సైబర్ క్రైమ్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడం గమనార్హం. వీరిరువురూ తమను కోటీ అనే వ్యక్తి వాట్సప్ మెసేజిలతో వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేశారు.