దోమలకు విచక్షణ ఏమీ ఉండదు అధ్యక్షా.. అవి అందరినీ కుట్టేస్తున్నాయ్...

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం సభకు హాజరుకాకపోయినప్పటికీ.. బీజేపీ సభ్యులు వస్తున్నారు. దీంతో అధికార తెలుగుదేశం, బీజేపీ సభ్యుల మధ్యే వాడివేడిగా వాదోపవాదాలు జరుగుతున్న

pnr| Last Updated: సోమవారం, 10 సెప్టెంబరు 2018 (14:28 IST)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం సభకు హాజరుకాకపోయినప్పటికీ.. బీజేపీ సభ్యులు వస్తున్నారు. దీంతో అధికార తెలుగుదేశం, బీజేపీ సభ్యుల మధ్యే వాడివేడిగా వాదోపవాదాలు జరుగుతున్నాయి.
 
ఈసమావేశాల్లో భాగంగా సోమవారం ప్రభుత్వం ఇటీవల చేపట్టిన దోమలపై దండయాత్ర కార్యక్రమంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో ప్రసంగించారు. మంత్రులు, అధికారులు ఎంత కష్టపడి పనిచేసినా దోమలపై దండయాత్ర అట్టర్ ఫ్లాప్ అయిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 2,80,000 మందికి జ్వరాలు వచ్చాయనీ, వీరితో తన కుమారుడు కూడా ఉన్నాడని చెప్పాడు. 
 
ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో నవ్వులు పూయించాయి. 'దోమలకు విచక్షణ ఏమీ ఉండదు అధ్యక్ష్యా. అవి అందరినీ కుట్టేస్తున్నాయ్. అధ్యక్షా.. ఇంతకు ముందు మా కామినేని శ్రీనివాస్‌ ఆరోగ్య మంత్రిగా ఉండేవారు. ఆయన పదవి నుంచి తప్పుకోగానే ప్రజలపై దోమల పోరాటం ఎక్కువైపోయింది. అధ్యక్షా (స్పీకర్) మీరు కూడా డాక్టరే.. మిమ్మల్ని కూడా దోమలు కుట్టేస్తాయ్. అసలు ఇది మంత్రికి సంబంధించిన విషయమా లేక మున్సిపాలిటీకి సంబంధించిన విషయమా?' అని వ్యాఖ్యానించారు. రాజు ప్రసంగాన్ని విన్న ప్రతి ఒక్కరూ నవ్వుల్లో మునిగిపోయారు. దీనిపై మరింత చదవండి :