బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 12 అక్టోబరు 2021 (23:47 IST)

వై ఎస్ ఆర్ సిపి అభ్యర్థిని ఆశీర్వదించండి: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

బద్వేలు ఉపఎన్నికలలో  వై ఎస్ ఆర్ సిపి అభ్యర్థి డా సుధను ఆదరించి ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

మంగళవారం ఆయన స్థానిక, కౌన్సిలర్లు , నాయకులు, కార్యకర్తలుతో కలసి బద్వేలు మున్సిపాలిటీలోని 18వ వార్డ్ లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.ప్రజా సంక్షేమమే జగన్ ప్రభుత్వ ధ్యేయమన్నారు.  జగన్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలును ప్రజలకు చీఫ్ విప్ వివరించారు. 
 
ఈ కార్యక్రమంలో ఎం ఎల్ సి రమేష్ యాదవ్, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్  చైర్మన్ సిద్దవటం యానాదయ్య, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ గోపాల్ స్వామి, స్థానిక కౌన్సిలర్లు, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.