మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 12 అక్టోబరు 2020 (20:45 IST)

బొత్స సత్యనారాయణ పెయిడ్ ఆర్టిస్ట్.. అన్నదెవరు?

మంత్రి బొత్స సత్యనారాయణపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సిపిఐ జాతీయ కార్యదర్సి నారాయణ. అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటున్న బొత్స సత్యనారాయణే పెద్ద పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ ధ్వజమెత్తారు. రైతులను కించపరిచే విధంగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 
 
అమరావతి ఉద్యమం 300వ రోజుకు చేరుకున్న సంధర్భంగా తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన దీక్ష చేపట్టారు సిపిఐ నారాయణ. రైతులు విమానాలు ఎక్కి తమ సమస్యను చెప్పుకునేందుకు వెళ్ళకూడదా అంటూ ప్రశ్నించారు. న్యాయవ్యవస్ధలపై వ్యాఖ్యలు చేయడం మొత్తం కూడా న్యాయవ్యవస్ధపై దాడిగా భావిస్తున్నామన్నారు. 
 
న్యాయవ్యవస్ధపై వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు నారాయణ. రాజధానిగా అమరావతిగా ఉండాలని రైతులను ఆందోళన చేయొచ్చు.. మూడు రాజధానులు అవసరమని అధికార పార్టీ నేతలు చెప్పుకోవచ్చు.. అంతేగానీ ఉద్యమాలను అణచివేసే విధంగా హేళనగా మాట్లాడడం మాత్రం మానుకోవాలంటూ వైసిపి నేతలను హెచ్చరించారు సిపిఐ నేత నారాయణ.