Widgets Magazine

ఫేస్‌బుక్‌లో కామెంట్స్ చేస్తే సరదాగా తీసుకోవాలి.. కేసులు పెట్టకూడదు : ఐవైఆర్ కృష్ణారావు

మంగళవారం, 20 జూన్ 2017 (15:20 IST)

Widgets Magazine

ప్రభుత్వానికి, ఏపీ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఉన్న ఐవైఆర్ కృష్ణారావుకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబును కలుసుకునేందుకు ఆర్నెల్లుగా అపాయింట్ కోరుతున్నా ఐవైఆర్‌కు దర్శనభాగ్యం దక్కలేదు. దీంతో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేశారు. వీటిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసి... బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి నుంచి ఐవైఆర్‌ను తొలగించినట్టు వార్తలు వస్తున్నాయి. అసలు ప్రభుత్వానికి, ఐవైఆర్‌కు మధ్య జరిగిన వివాదాన్ని పరిశీలిస్తే...
iyr krishna rao - chandrababu
 
‘అన్ని వర్గాలకూ అండగా ఉండాలి. అగ్రవర్ణ పేదలనూ ఆదుకోవాలి’ అన్న ప్రభుత్వ విధానంలో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌‌ను సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారు. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసి రిటైర్డ్ అయిన ఐవైఆర్‌ను ఛైర్మన్‌గా నియమించారు. 'సోషల్‌ మీడియాలో ఏవైనా విమర్శలు చేస్తే సరదాగా తీసుకోవాలి కానీ కేసులు పెట్టడం నియంతృత్వ వైఖరికి దారితీస్తుంది' అని కృష్ణారావు ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. 
 
'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాకు వినోద పన్ను మినహాయింపు, 'బాహుబలి-2' సినిమా అదనపు షోలకు అనుమతులు ఇవ్వడాన్నీ తప్పుపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా అనిల్‌ కుమార్ సింఘాల్‌ను నియమించడాన్ని కూడా ఐవైఆర్‌ ప్రశ్నించారు. తెలుగేతర అధికారులను టీటీడీలో నియమించడం మంచి పద్ధతి కాదన్నారు. ఇలా... ప్రభుత్వం నియమించిన పదవిలో ఉన్న ఆయన ప్రభుత్వ విధానాలను ఫేస్‌‌బుక్‌ వేదికపై విమర్శించడం వివాదాస్పదంగా మారింది. 
 
ఈ అంశంపై మంత్రి బొండా ఉమా ఎలక్ట్రానిక్‌ మీడియా ముందు స్పందించారు. కృష్ణారావు సరికాదని తెలిపారు. 'ప్రభుత్వ విధానాలపై నమ్మకం లేకపోతే మీరు తక్షణం ఆ పదవికి రాజీనామా చేయండి. పేద బ్రాహ్మణులకు సహాయం చేయగల సమర్థులు, అనుభవజ్ఞులైన వారు చాలామందే ఉన్నారు. వారిలో ఒకరిని ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమిస్తుంది' అంటూ ఫేస్‌బుక్‌ వేదికగానే డిమాండ్లు కూడా మొదలయ్యాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Sack Share Chandrababu Govt Brahmin Corporation Chairman Iyr Krishna Rao

Loading comments ...

తెలుగు వార్తలు

news

వర్జీనియాలో విద్వేష హత్య: రంజాన్ భోజనం చేసి బయటికొచ్చిన యువతిని.. బేస్‌బాల్ బ్యాట్‌తో?

అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ సర్కారు ముస్లిం దేశాలను పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ...

news

రాష్ట్రపతి కంటే అంబులెన్సే ముఖ్యమన్న ట్రాఫిక్ ఎస్ఐ... దారి కోసం రాష్ట్రపతి కాన్వాయ్ నిలిపివేత!

బెంగుళూరు ట్రాఫిక్ ఎస్ఐ పేరు ఇపుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. దీనికి కారణం ఆయన దేశ ...

news

షాకింగ్... మృగరాజు సింహాన్ని కుళ్లబొడిచి చంపిన గేదె(వీడియో)

బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్క చావదె సుమతీ అని నీతి పద్యంలో చదువుకున్నట్లే ఎంత ...

news

కేసీఆర్ సూచన మేరకే దళితుడిని అభ్యర్థిగా మోడీ ప్రకటించారా? కేసీఆర్‌కే తొలి ఫోనెందుకు?

ఎన్డీయే కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా న్యాయకోవిదుడైన దళితనేత ప్రస్తుతం బీహార్ ...