లెఫ్ట్ పార్టీలపై బాబు కామెంట్: వెనక్కి తీసుకోవాలంటున్న బీవీ!
రాజధాని కోసం 1000 ఎకరాలు చాలంటున్న వామపక్షాలు.. తమ పార్టీ కార్యాలయాల కోసం 10 ఎకరాల మేర భూములు అడుగుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. వామపక్షాలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను చంద్రబాబు తక్షణమే ఉపసంహరించుకోవాలని బీవీ హెచ్చరించారు.
రాజధాని కోసం వెయ్యెకరాలు చాలంటున్న వామపక్షాలు, తమ పార్టీ కార్యాలయాల కోసం పదెకరాల మేర భూములు అడుగుతున్నాయని చంద్రబాబు ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన రాఘవులు, పంట భూముల్లో రాజధాని నిర్మాణం బుద్ధి తక్కువ పని అంటూ ధ్వజమెత్తారు.
మంగళగిరి సమీపంలో భారీగా ప్రభుత్వ భూములున్నా, వాటిని వదిలేసిన చంద్రబాబు సర్కారు తుళ్లూరును రాజధానిగా ఎంచుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆయన ఆరోపించారు.