శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (15:08 IST)

రేవంత్ రెడ్డిపై 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీద బంజారాహిల్స్ పోలీసులు 504, 505 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మెడికల్ కాలేజీ వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్తోపాటు మరికొంత మందికి ముడుపులు అందాయని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడంతో నాంపల్లి కోర్టు రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. 
 
రేవంత్ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని ఓ న్యాయవాది నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దాంతో రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.