గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (13:08 IST)

నెల్లూరులో ఘోరం ప్రమాదం.. పది మందికి గాయాలు

road accident
జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళుతున్న ఆటో ఒకటి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ వేగానికి ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన నెల్లూరు శివారులో చోటుచేసుకుంది. 
 
ఈ ప్రమాదం మొత్తం ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డవ్వగా, ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వీక్షకులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
 
వైరల్ వీడియోలో, ఆటో డ్రైవర్ వాహనంపై నియంత్రణ తప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.