శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (12:58 IST)

ఏపీకి కేంద్రం తీపి కబురు.. కేంద్రం నుంచి భారీ నిధులు

ys jagan
కేంద్ర ప్రభుత్వం ఏపీకి తీపి కబురు అందించింది. రాష్ట్రంలో 609 కి.మీ.మేర రహదారుల అభివృద్ధికి రూ. 6,421 కోట్లు కేటాయించాలని ఆర్‌ అండ్‌ బీ శాఖ ప్రతిపాదనలను ఇచ్చింది.
 
ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి పలు ప్రాజెక్టులపై చర్చించారు. ప్రతిపాదనల కంటే ఎక్కువగా రహదారులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. దీంతో సానుకూలంగా స్పందించిన కేంద్రం.. భారీగా నిధులు కేటాయించింది. తద్వారా  ఏపీ ప్రభుత్వం 2021-22 వార్షిక ప్రణాళిక కింద ప్రతిపాదించిన దానికంటే ఎక్కువగా నిధులు వచ్చాయి.
 
2021-22 వార్షిక ప్రణాళిక కేటాయింపులను ఖరారు చేయగా.. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,869 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో 25 ప్రాజెక్టుల కింద 700 కి.మీ. మేర హైవేలను ఈ నిధులతో అభివృద్ధి చేయనున్నారు.