శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2022 (10:53 IST)

ఏపీలో గనులను వేలం వేయనున్నకేంద్రం.. ఆదాయం కోసం..

Gold mine
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ తరహా గౌరవం ఆంధ్రా గోల్డ్ ఫీల్డ్స్‌కు దక్కబోతోంది. ఇప్పటికే ఏపీలో పది గనులకు టెండర్లు పిలిచింది. దీంతో ఏపీలో మళ్లీ బంగారం తవ్వకాలు ప్రారంభం కానున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఆదాయం పెంచుకునేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఏపీలోని అనంతపురం జిల్లాలో ఉన్న బంగారం నిక్షేపాలు ఉన్న గనులను వేలం వేసేందుకు నిర్ణయించింది. 
 
అనంతపురం జిల్లాలో ఐరన్, బాక్సైట్‌తో పాటు బంగారు నిక్షేపాలు కూడా భారీగా ఉన్నట్లు గతంలోనే సైంటిస్టులు గుర్తించగా ఏకంగా 10 చోట్ల బంగారం తవ్వుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. వీటిలో 5 గనులకు ఈ నెల 26న, మిగతా ఐదింటికి 29న వేలం నిర్వహించనున్నారు.