అయోధ్య కేసు తీర్పు.. ట్వీట్ చేసిన చంద్రబాబు.. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిద్దాం..

సెల్వి| Last Updated: శనివారం, 9 నవంబరు 2019 (10:16 IST)
దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయోధ్య కేసులో శనివారం అత్యున్నత న్యాయస్థానం మరికాసేపట్లోతీర్పు వెలువరించనుంది. దీంతో దేశమంతా హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ తీర్పుపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

"ఇవాళ అయోధ్య కేసులో తీర్పు రానుంది. మతపరమైన అనుబంధాల వల్ల మనం దూరం కాకూడదు. మనమంతా సుప్రీంకోర్టు తీర్పును గౌరవిద్దాం , సమాజంలో శాంతి మరియు సామరస్యాన్ని కాపాడటానికి ఐక్యంగా ఉందాం" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

మరోవైపు టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా అయోధ్య కేసు తీర్పుపై ట్వట్ చేశారు. అయోధ్య కేసుకు సంబంధించి జిల్లా కోర్టు మొదలుకుని, సుప్రీంకోర్టు వరకు అన్ని పక్షాల వాదనలు కోర్టులు వినడం జరిగింది. దేశ సామరస్యం, దేశ భవిష్యత్తు దృష్ట్యా తీర్పును గౌరవిద్దాం’ అంటూ ట్వీట్ చేశారు.దీనిపై మరింత చదవండి :