1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 29 జనవరి 2017 (05:03 IST)

నా బ్రాండ్ ఇమేజ్ ఎంత పెరిగిపోయిందో చూశారా: మురిసిపోయిన బాబు

విశాఖపట్నంలో జరుగుతున్న పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు చివరి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మురిసిపోయిన ఘటన ఒకటి జరిగింది. నేపాల్‌నుంచి వచ్చిన మంత్రి ఒకరు తనను కలవడానికే వచ్చి అపాయింట్‌మెంట్ దొరక్క వెళ్లిపోతుంటే విషయం తెలిసిన బాబు అఘమేఘాల మీద మంత్ర

విశాఖపట్నంలో జరుగుతున్న పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు చివరి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మురిసిపోయిన ఘటన ఒకటి జరిగింది. నేపాల్‌నుంచి వచ్చిన మంత్రి ఒకరు తనను కలవడానికే వచ్చి అపాయింట్‌మెంట్ దొరక్క వెళ్లిపోతుంటే విషయం తెలిసిన బాబు అఘమేఘాల మీద మంత్రులను పంపి మరీ ఆ మంత్రిని తన వద్దకు రప్పించుకున్నారు. ఈ సందర్భంలో బాబు ఎంతగా మురిసిపోయారంటే తన బ్రాండ్ ఇమేజి అంతా ఇంతా పెరగలేదనేశారు.
 
నేపాల్‌ నుంచి వచ్చిన మంత్రిని శుక్రవారం సమాచారం లోపం వల్ల కలవలేకపోయానని, అప్పటికప్పుడు మంత్రులను పంపి అపాయింట్‌మెంట్‌ ఇచ్చానన్నారు. ఆయన కేవలం తనను కలవడానికే వైజాగ్‌ వచ్చానని చెప్పడం ఆనందాన్నిచ్చిందన్నారు. నన్ను కలవలేకపోతున్నందుకు బాధపడుతూ వెళ్లిపోదాం అనుకున్నట్లు చెప్పారన్నారు. బయటి వాళ్లు నన్ను కలవలేకపోయామని బాధపడుతున్నారంటే విదేశాల్లో నాకు ఎంత బ్రాండ్‌ ఇమేజ్‌ పెరిగిందో అర్థం చేసుకోవాలని చంద్రబాబు చెప్పారు.
 
చంద్రబాబు అంతటితో వదిలిపెట్టి ఉంటే మీడియా బతికిపోయేది.  తన బ్రాండ్ ఇమేజి మైకంలో బాబు తన్ను తాను ప్రశంసల వర్షంతో ముంచెత్తుకున్నారు. అప్పట్లో తన ఎంపీల బలంతోనే వాజ్‌పేయి ప్రభుత్వం ఏర్పడటంతో అన్నీ తాను చెప్పినట్లు జరిగేవన్నారు. దేశంలో తనను మించిన సీనియర్‌ నాయకుడు ఎవరూ లేరని తేల్చిచెప్పారు. ప్రధాని దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు అందరినీ తానే ఎంపిక చేసేవాడినని చెప్పుకొచ్చారు.   
 
గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీస్‌(సీఐఐ) అనేది చాలా చిన్న సంస్థ అని, దాన్ని ఎవరూ పట్టించుకునే వారు కాదని , కానీ దానిని తానే ప్రమోట్‌ చేశానన్నారు.