బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2023 (15:21 IST)

టీడీపీ హయాంలో ఉచితంగా ఇసుకు.. కేసు పెట్టిన జగన్ సర్కారు.. బెయిల్ కోరుతూ..

chandrababu
గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇసుకను పంపిణీ చేసింది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరిందని పేర్కొంటూ వైకాపా ప్రభుత్వం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేసు పెట్టింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విధానపరమైన నిర్ణయాలను తప్పుబడుతున్నారని పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆధారాలు లేని కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నార. కాగా, ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. 
 
కాగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇసుక సరఫరా చేశారు. తవ్వకం, రవాణా ఖర్చులను భరించే వారికి ఇసుకును ఉచితంగా ఇచ్చారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి రూ.1300 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని పేర్కొంటూ చంద్రబాబుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు నాయుడు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమ పేర్లను చేర్చింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.