శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (09:05 IST)

నేడు కుప్పంలో చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో మూడు రోజుల పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గుడపల్లె మండలానికి బాబు చేరుకోనున్నారు. కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ శ్రేణులు హెచ్చరించారు.

నిన్నటి రోజున టీడీపీ నాయకుల ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు దగ్ధం చేశారు. దీంతో కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు బలగాలు చేరుకున్నారు. ప్రస్తుతం కుప్పంలో ప్రశాంత వాతావరణం నెలకొంది.

చంద్రబాబు గురు, శుక్ర, శని వారాల్లో మూడు పర్యటించనున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు గుడుపల్లె మండలం ద్వారా కుప్పం నియోజకవర్గంలో ప్రవేశించే చంద్రబాబు శనివారం మధ్యాహ్నం 12.30 గంలకు ఇక్కడినుంచి బయలుదేరి వెళ్లనున్నారు.