కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ

మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (22:28 IST)

chandrababu naidu-Arun Jaitely

న్యూఢిల్లీ: రాష్ట్ర రెవెన్యూ లోటు భర్తీ చేయడం, పోలవరం ప్రాజెక్ట్ పెరిగిన వ్యయం అంచనాలకు అనుగుణంగా కేంద్రం నిధులు విడుదల చేయడం, తిరుమల టిక్కెట్లు, ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వడం... ఈ మూడు కీలక అంశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ముందు ప్రముఖంగా ప్రస్తావించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి కేంద్రం ఇతోధికంగా సహాయం అందించాల్సిందిగా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రెవెన్యూ లోటు భర్తీ కింద రూ. 2,800 కోట్లు, పోలవరం ప్రాజెక్ట్ కోసం రూ. 3,000/- కోట్లు విడుదలకు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ సానుకూలంగా స్పందించారు. 
 
రెవెన్యూ లోటు భర్తీ విషయంలో జులై నెలలో వివరణాత్మకంగా ఇచ్చిన లేఖలోని అంశాలనే ఉటంకిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు  ఒక లేఖను అరుణ్ జైట్లీకి అందజేశారు. ముఖ్యంగా విదేశీ ఆర్థిక సహాయ ప్రోజెక్టుల (ఈఏపి), కేంద్ర సహాయంతో అమలు చేస్తున్న ప్రాజెక్టులకు 90:10 నిష్పత్తిలో ప్రత్యక సహాయం అందించాలని అరుణ్ జైట్లీ కి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇది దాదాపుగా రూ.20,010 కోట్ల రూపాయలు మేరకు ఉంటుందని వివరించారు. ఈఏపి, చిన్నమొత్తాల పొదుపు, నాబార్డ్ కు సంబంధించిన పాత రుణబకాయిలు చెల్లించుకొనే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించాలని ఆయన  నాబార్డ్, హడ్కో, ఇతర వాణిజ్య బ్యాంకుల నుంచి అంతర్గతంగా రుణాలు పొందే వెసులుబాటు ఇవ్వాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక సహాయాన్ని ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కోరారు.
 
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఇప్పటి వరకు జరిగిన ప్రగతిని వివరిస్తూ మరో లేఖను ముఖ్యమంత్రి సమర్పించారు. ముఖ్యంగా 2010-11 సంవత్సరం నాటి లెక్కల ప్రకారం పోలవరం అంచనా 16,010 కోట్ల రూపాయలైతే, 2013-14   సంవత్సరానికి ఆ అంచనా 58,319 కోట్ల రూపాయలకు చేరుకుందని ముఖ్యమంత్రి తెలిపారు. 2017 ఆగస్టు వరకు పోలవరం ప్రాజెక్ట్ కోసం 12,335 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇప్పటి వరకు 4,329 కోట్ల రూపాయలు విడుదల చేసిందని ఆయన అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ పోలవరం పై ఇప్పటికే ఖర్చు చేసిన 2,871 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు.
 
డిజిటలీకరణలో  భాగంగా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఫోన్, టీవీ సౌకర్యం కల్పించడానికి సంకల్పించిందని ముఖ్యమంత్రి చెప్పారు. కొత్తగా వచ్చిన జీఎస్టీ వల్ల అధికంగా పన్ను భారం పడుతుందని ఆయన తెలిపారు.  అందువల్ల 18 శాతం ఉన్న జీఎస్టీ ని 5 శాతానికి తగ్గించాల్సిందిగా కేంద్ర మంత్రి జైట్లీని ముఖ్యమంత్రి కోరారు. ఇదే విధంగా తిరుమల తిరుపతి దర్శనం టిక్కెట్లు, లడ్డు ప్రసాదాన్ని కూడా జీఎస్టీ నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. 
 
అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి వెంట కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, దేవినేని ఉమామహేశ్వర రావు, పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక కమీషనర్, డా. రజత భార్గవ్, రెసిడెంట్ కమీషనర్, ప్రవీణ్ ప్రకాష్, ఇ ఎన్ సి., వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అక్టోబర్ 2న ఆంధ్రప్రదేశ్‌లో లక్ష గృహ ప్రవేశాలు.. మంత్రి కాలవ శ్రీనివాసులు

అమరావతి : రాష్ట్రంలో అక్టోబర్ 2న ప్రపంచ ఆవాస దినం, గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వ సహాయంతో ...

news

ఒక యజ్ఞంలాగా రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మిస్తున్నాం... చంద్రబాబు

‘‘ఒక పవిత్ర యజ్ఞంగా రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మిస్తున్నాం. ఎక్కడా పనులు ఆగకూడదు, ...

news

విద్యార్థినిపై అత్యాచార యత్నం... సన్నివేశాలు సోషల్ మీడియాలో పోస్ట్(వీడియో)

కామాంధుల దుశ్చర్యలు రోజురోజుకీ పెచ్చుమీరిపోతున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరిలో డిగ్రీ ...

news

జర్నలిస్టులందరికీ ఇళ్లు... మంత్రి కాలవ శ్రీనివాసులు

అమరావతి: రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న కృతనిశ్ఛయంతో ప్రభుత్వం ...