అనిల్ అంబానీతో సహా కేంద్రానికి చంద్రబాబు షాక్... ఆ భూములు ఇచ్చేయండి...

సోమవారం, 14 మే 2018 (16:21 IST)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో పాటు అనిల్ అంబానీకి కూడా షాక్ ఇచ్చారు. వివిధ ప్రాజెక్టుల పేరిట తీసుకున్న భూములను వెనక్కు ఇచ్చేయాలంటూ నోటీసులు పంపారు. దీంతో షాక్ అయిన అనిల్ అంబానీ హుటాహుటిని అమరావతి చేరుకున్నారు. తమకు ఇచ్చిన భూములపై ఆయన చంద్రబాబు నాయుడుతో మంతనాలు సాగిస్తున్నారు. 
chandrababu naidu
 
ఇదిలావుంటే అనిల్ దీరూభాయ్ అంబానీ గ్రూప్ అడాగ్ నెల్లూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో విద్యుత్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం భూములను సేకరించింది. ఐతే ఈ ప్రాజెక్టుల్లో పురోగతి లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం సదరు భూమిని వెనక్కు తీసుకోవాలని నిర్ణయిస్తూ నోటీసులు పంపింది. 
 
అంతేకాదు... ఎల్ఐసీ, ఎస్బీఐ తదితర కార్యాలయాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న భూమిని కూడా తిరిగి తమకు అప్పగించాలంటూ సీఆర్డీయే నోటీసులు పంపింది. ఈ నేపధ్యంలో సీఎం చంద్రబాబు నాయుడుని అనిల్ అంబానీ కలిసి ప్రాజెక్టుల నిర్మాణం ఏ దశలో వున్నదో వెల్లడిస్తారని సమాచారం. మరి కేంద్రం ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

150 సెగ్మెంట్లలో 'తలైవా' ఓటు బ్యాంకు - సర్కారు బెంబేలు...

తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం, రాజకీయ కురువృద్ధుడు ...

news

రజనీకాంత్‌ కత్తికి రెండు వైపులా పదును... వ్యూహాత్మక అడుగులు

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. ఇందులోభాగంగా, ఆయన ఇప్పటికే ...

news

కన్నాకు పదవి... 'కమలం'లో కుమ్ములాటలు... అజ్ఞాతంలోకి సోము వీర్రాజు

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ...

news

రోజురోజుకీ ముదురుతోన్న వ‌ర్ల రామ‌య్య వివాదం... విద్యార్థి తల్లి ఆవేదన(video)

ఏపీఎస్ ఆర్టీసి చైర్మన్ వర్ల రామయ్య ఓ విద్యార్థిని కులం పేరుతో తిట్ట‌డం.. నీకు చ‌దువు ఏం ...