శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2022 (11:13 IST)

చంద్రబాబు సలహా బాగుంది.. విజన్ సిద్ధం చేయండి : ప్రధాని మోడీ

modi - babu
హస్తిన వేదికగా జి-20 సమావేశం సన్నాహకాల్లో భాగంగా, సోమవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటలకు పైగా ఈ కీలక భేటీ జరిగింది. ఇందులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానంగా డిజిటల్ నాలెడ్జ్ అంశంపై మాట్లాడారు. దేశ ప్రగతిపై వచ్చే 25 యేళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయాలని సూచించారు. వచ్చే పాతికేళ్లలో భారత్ మొదటి లేదా రెండో స్థానానికి చేరడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
మన దేశానికి ఉన్న ప్రధాన బలం యువశక్తి అని బాబు గుర్తు చేశారు. వారికి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వాలు తమ విధి విధానాలను రూపొందించుకోవాలని బాబు పిలుపునిచ్చారు. దేశానికి మానవ వనరుల శక్తిని నాలెడ్జ్ ఎకానమీకి అనుసంధానిస్తే అద్భుతమైన ఫలితాలు అందుకోవచ్చని చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. 
 
ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ప్రసంగంలో చంద్రబాబు చేసిన నాలెడ్జ్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించండం గమనార్హం. ఈ సమావేశం నేపథ్యంలో ప్రధాని మోడీతో చంద్రబాబు పది నిమిషాల పాటు ప్రత్యేకంగా మాట్లాడారు. పలు అంశాలపై ఇరువురు చర్చించుకోవడం గమనార్హం. ముఖ్యంగా, చంద్రబాబు చెప్పిన విషయాలన్నీ ప్రధాని మోడీ ఆసక్తిగా ఆలకించారు.