శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 11 డిశెంబరు 2021 (16:55 IST)

సీఎం జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు సవాల్, ఏంటది?

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు ఓ సవాల్ విసిరారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ ఇంతకాలం ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.

 
ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని ఎందుకు నిలదీయడంలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం మా ఎంపీలు రాజీనామా చేస్తారు, మరి మీ ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు.

 
ప్రత్యేక హోదా వస్తే ఒంగోలు వంటి నగరాలు హైదరాబాద్ మహానగరంలా మారిపోతాయని చెప్పిన జగన్ ప్రత్యేక హోదాపై ఎందుకు మౌనంగా వున్నారో చెప్పాలన్నారు. ఓ వైపు విశాఖ ప్లాంట్ కోసం కార్మికులు దీక్షలు చేస్తుంటే దానిపై పల్లెత్తు మాట అనకుండా మౌనంగా ఎందుకు వున్నారని నిలదీశారు.