శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (18:35 IST)

పల్లెల్లో ప్రలోభాలపర్వం.. చికెన్, మటన్, చీరలు, మందు

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల పోరు చివరి దశకు వచ్చేసరికి పల్లెల్లో ప్రలోభాలపర్వం జోరందుకుంది. పల్లె పగ్గాల కోసం అభ్యర్థులు ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. కొన్ని చోట్ల అడిగినంత ముట్టజెప్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఓటర్లు ఏమడిగితే అది కొనిస్తున్నారు. 
 
ఇక చివరి నిముషంలో చికెన్, మటన్, చీరలు, మందు ఇలా ఓటర్లను కానుకలతో ముంచేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఓటుకు రూ.200 నుంచి రూ.10వేల వరకు పంచిన ఘటనలు ఏపీలో చోటు చేసుకున్నాయి. 
 
ముఖ్యంగా మూడో విడత ఎన్నికల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, జంగారెడ్డిగూడెం మండలాల్లో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.4వేల వరకు పంపిణీ చేశారు. అంతేకాదు సొంతపార్టీకి చందిన చెందిన వారికి తక్కువ మొత్తం.. ప్రత్యర్థి పార్టీకి ఓట్లు వేస్తారనుకున్నవారికి ఎక్కువ మొత్తంలో డబ్బులిచ్చారు.
 
ఇక ఓ గ్రామంలో సర్పంచ్ పదవికి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడటంతో పోటీపడి మరీ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. వారిలో ఓ అభ్యర్థి ఓటుకు రూ.1200 ఇవ్వడమే కాకుండా.. కిలో చికెన్, 30 కోడిగుడ్లను పంపిణీ చేశారు.