Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అక్క ప్రియుడితో వెళ్తానని తెగేసి చెప్పేసింది.. చెల్లి బోరుమంది.. ఎస్పీ నేనున్నానంటూ..?

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (12:33 IST)

Widgets Magazine

అవును వాళ్ళిద్దరూ సిస్టర్స్. తల్లిదండ్రులు లేరు. అక్కే చెల్లాయి బాగోగులు చూసుకునేది. అయితే ఇంతలోనే ప్రేమించిన యువకుడితో జీవితం పంచుకునేందుకు అక్క సిద్ధమైపోయిది. దీంతో అక్క వెళ్ళిపోతుండటంతో తనకెవరు దిక్కు అంటూ చెల్లి బోరున విలపించింది. కానీ ఆ సమయంలో చిక్కమంగళూరు ఎస్పీ ఆ అమ్మాయికి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. అక్క ప్రియుడితో వెళ్తుంటే చెల్లి ఏడుస్తూ విలపిస్తుంటే.. సాక్షాత్తు జిల్లా ఎస్పీ ముందుకువచ్చి అన్నయ్య నీ బాగోగులు చూసుకుంటానంటూ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. 
 
పూర్తి వివరాల్లోకి వెళితే చిక్కమంగళూరులో ఓ కుటుంబంలోని అక్కాచెల్లెళ్ళు ఎలాంటి చీకు చింత లేకుండా హాయిగా గడిపేవారు. ఉద్యోగం చేస్తున్న అక్క చెల్లాయి విద్యాభ్యాసం బాగోగులన్నీ తానే చూసుకొనేది. కొద్దికాలంగా అక్క ఓ యువకుడి ప్రేమలో పడింది. కుటుంబీకులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఈ వ్యవహారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరింది. ఎస్పీ కె.అణ్ణామలై విచారణ జరిపిన సమయంలో తాను ప్రేమించిన యువకుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. దీంతో చెల్లి గుండె ఒక్కసారిగా గుబేల్‌మంది. 
 
తల్లీతండ్రిని ఇప్పటికే పోగొట్టుకున్న చెల్లాయి ప్రస్తుతం అక్క కూడా దూరమైపోవడంతో బాధపడింది. తననుంచి అక్కను దూరం చేయవద్దంటూ ఎస్పీ కాళ్లపై పడి ప్రాధేయపడింది. అయితే అక్కడ ప్రేమ వ్యవహారం, చెల్లి దీనగాధ విని చలించిన ఎస్పీకి కాసేపు ఏం చేయాలో తోచలేదు. చివరికి ఆయన చెల్లి బాధ్యతలను తానే స్వీకరిస్తానని ప్రకటించారు. ఆమెకు తాను అన్నయ్యగా ఉంటానని చెప్పాడు. ఆమె విద్యాభ్యాసం పూర్తయ్యేంత వరకు ఖర్చులన్నింటినీ భరోసా ఇచ్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రత్యేక హోదాతో ప్రయోజనం శూన్యం.. పారిశ్రామిక రాయితీలు ఉండవు : చంద్రబాబు

విభజన చట్టం మేరకు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ...

news

యూపీఏ, ఎన్డీయేలు ఫుట్‌బాల్ ఆడుకున్నాయ్.. విజయ్ మాల్యా రుసరుసలు

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. బ్యాంకులకు వేల కోట్ల ...

news

తెలంగాణను వణికిస్తోన్న స్వైన్ ఫ్లూ మహమ్మారి.. డిప్యూటీ సీఎంకు స్వైన్ ఫ్లూ

స్వైన్ ఫ్లూ మహమ్మారి తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తోంది. తెలంగాణలో 18 మందికి స్వైన్ ఫ్లూ ...

news

రూ.వంద కోట్ల భూస్కామ్‌కు పాల్పడిన తాహశీల్దారు... ఎక్కడ?

విశాఖపట్టణం రూరల్ తాహశీల్దారు మజ్జి శంకర రావు ఏకంగా వంద కోట్ల రూపాయల భూకుంభకోణానికి ...

Widgets Magazine