శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 19 జులై 2020 (13:52 IST)

అద్భుతం.. చిలుకూరు ఆలయంలో కూర్మం.. శుభసంకేతమే.. కరోనా అంతమై అమృతం లభిస్తుందట!!

tortoise in Chilkur temple
చిలుకూరు బాలాజీ ఆలయంలో అద్భుతం జరిగింది. ఆలయంలోని శివాలయంలో ఒక తాబేలు ఎక్కడి నుంచో ప్రవేశించింది. లోపలికి రావడానికి ఎలాంటి మార్గం లేకపోయినా ఆలయంలోకి ఇది ఎలా వచ్చిందనేది ఆలయ సిబ్బందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. 
 
దాదాపు పది సెంటీ మీటర్ల పొడవు, ఆరు సెంటీమీటర్ల వెడల్పున్న ఈ తాబేలు ఎలా ఆలయంలోకి వచ్చిందనే దానిపై స్పష్టత లేదని శివాలయం పూజారి సురేష్ ఆత్మారాం తెలిపారు. ఈ ఘటనపై చిలుకూరు బాలాజీ ఆయన ప్రధాన పూజారి రంజరాజన్ హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇది చాలా శుభసూచకమని, తర్వలోనే కరోనా గురించి ప్రజలు శుభవార్త అందుకుంటారని చెప్పారు.
 
ఈ కూర్మ మూర్తి ప్రవేశం ఒక దివ్యమైన సంకేతాన్ని సూచిస్తుంది, కూర్మావతారం ఉద్దేశం క్షీరసాగర మథనం. పూర్వం అమృతం కోసం క్షీరసాగర మథనం జరిగినప్పుడు కూర్మరూపంలో వచ్చిన మహావిష్ణువుపైనే మేరు పర్వతాన్ని కవ్వంగా ఉంచి వాసుకి సాయంతో ఒకవైపు దేవతలు, ఒకవైపు అసురులు మదించారు. ఇప్పుడు కూడా కోవిడ్-19పై విజయం కోసం విశ్వమంతా ప్రయత్నం చేస్తుంది. 
 
సాగర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని పరమశివుడు మింగుతాడు.. ఇవాళ చిలుకూరులో సుందరేశ్వర స్వామి సన్నిధిలో కూర్మం ప్రత్యక్షమవడం అంటే త్వరలోనే లోకం నుంచి ఈ వైరస్ అంతమై అమృతం లభిస్తుందని సాక్షాత్తు ఆ వేంకటేశ్వర స్వామి సూచిస్తున్నట్లుగా ఉందని రంజరాజన్ చెప్పారు. భక్తులు చేసే ప్రార్థనలు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సేవలు, ప్రభుత్వం ప్రయత్నాలు అన్నిటికీ తొందరలో మంచి ఫలితం లభిస్తుందని రంగరాజన్ తెలిపారు.