Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్యాభర్తల మధ్య గొడవ: కోపంతో కిరోసిన్ పోసుకుంది.. భర్త నిప్పంటించేశాడు.. ఆ తర్వాత?

మంగళవారం, 27 జూన్ 2017 (11:00 IST)

Widgets Magazine
student fire

భర్తతో గొడవపడిన భార్య ఆవేశంతో ఒంటిపై కిరోసిన్ పోసేసుకుంది.. అదే ఆవేశంతో భర్త కూడా నిప్పటించేశాడు. ఈ ఘటన చీరాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమ‌రావ‌తిలోని తుళ్లూరు మండలం వెంకటాయపాలెం గ్రామంలో వివాహేత‌ర సంబంధం భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య చిచ్చురేపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. 
 
వివరాల్లోకి వెళితే.. చీరాలలోని తోటావారిపాలెం గ్రామానికి చెందిన ప్రశాంతి కుమారి(25) బీఎస్సీ న‌ర్సింగ్ విద్య పూర్తి చేసింది. ఆమె ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన బాపట్ల అశోక్‌ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారు ఇద్ద‌రూ వెంకటాయపాలెంకు వలస వచ్చి అక్క‌డే ప‌నిచేసుకుంటున్నారు. ప‌నికి వెళ్లిన‌ అశోక్ భోజనానికి ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. ఎంతసేపటికీ తలుపు తీయలేదు. అయితే ఒక్కసారిగా ఇంట్లో నుంచి గ్రామ పంచాయతీ గుమస్తా.. పి. సత్యనారాయణ పరుగులు తీస్తూ బయటకు వచ్చి.. అశోక్‌ను తోసుకుంటూ పారిపోయాడు. 
 
స‌త్య‌నారాయ‌ణ త‌మ ఇంట్లో ఏం చేస్తున్నాడ‌ని భార్యను అశోక్ నిల‌దీశాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది‌న ప్రశాంతి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుంది. అదే కోపంలో అశోక్ ఆమెకు నిప్పు అంటించాడు. అనంత‌రం ఆయ‌నే మంటలు ఆర్పి ఆమెను బ‌యటకు తీసుకొచ్చాడు. ఆ భ‌ర్త‌కు కూడా నిప్పు అంటుకుంది. స్థానికులు వారిద్దరినీ విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్ర‌శాంతి మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఏమండీ.. మరిది వేధిస్తున్నాడు.. పట్టించుకోని భర్త.. వివాహిత అనుమానాస్పద మృతి

ఒంగోలు జిల్లా గుడ్లూరు మండలం రావూరు గ్రామానికి చెందిన ఓ వివాహిత అనుమానాస్పదంగా ...

news

జూలై 2తో ముగుస్తుంది.. ఆ తర్వాత ఎక్కడుంటానో తెలియదు : స్మృతి ఇరానీ

తన రాజకీయ భవిష్యత్‌పై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆసక్తికరమైన సమాధానం ...

news

ఆరడుగుల శిరీషను ఇద్దరు లొంగదీసుకోవడమా? షర్ట్ బటన్‌లు అలా వున్నాయి..

ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీషను ఒక్కరో లేక ఇద్దరో ఏమీ చేయలేరని ...

news

నోవాటెల్ హోటల్‌లో 7 గంటలున్న భరత్... ఏం చేశాడో వెల్లడించని ఖాకీలు...

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు హైదరాబాద్ నోవాటెల్ ...

Widgets Magazine