శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 డిశెంబరు 2019 (21:50 IST)

దిశా కేసు : ఆడపిలల్లకు చిరంజీవి అడ్వైజ్ (వీడియో)

హైదరాబాద్, శంషాబాద్​ పశు వైద్యురాలి అత్యాచార ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందిచారు. ఈ ఘటన తన మనసును కలచివేసిందని, ఇలాంటి మగమృగాల మధ్యా మన ఆడవాళ్లు బతికేది? అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

'గత రెండు మూడు రోజులుగా ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు చూస్తుంటే గుండె తరుక్కు పోతోంది. ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదనే భావం కలుగుతోంది. మగమృగాల మధ్యా మనం బతుకుతోంది.. అనిపిస్తోంది. మనసు కలచివేసిన ఈ సంఘటనల గురించి ఒక అన్నగా, ఓ తండ్రిగా స్పందిస్తున్నాను. 
 
ఇలాంటి నేరాలు చేసిన దుర్మార్గులకు శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. భయం కలిగించేలా ఉండాలి. నడిరోడ్డుపై ఉరితీసినా తప్పు లేదు. త్వరగా నేరస్థులను పట్టుకోవడం అభినందనీయమే. అలాగే త్వరితగతిన శిక్ష పడేలా చూడాలి. అప్పుడే ఇలాంటి నేరాలు చేయాలంటే ఎవరైనా భయపడతారు' అని చెప్పుకొచ్చారు. 
 
'మహిళలకు రక్షణ కల్పించడం, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆడపిల్లలందరికీ నేను చేప్పేది ఒకటే. మీ ఫోనులో 100 నెంబరును స్టోర్ చేసుకొని పెట్టుకోండి. అలాగే మీ స్మార్ట్ ఫోనులో హాక్​ ఐ యాప్​ను డౌన్లోడ్ చేసుకోండి. ఒక్క బజర్ నొక్కితే చాలు.. షీ టీమ్స్ హుటాహుటిన మిమ్మల్ని చేరుకుంటాయి. పోలీసు వారి సేవలను.. అలాగే వారి టెక్నాలజీని మీరు వినియోగించుకోండి' అంటూ చిరంజీవి మహిళలకు సలహా ఇచ్చారు. 
 
కాగా, ప్రియాంకా రెడ్డి హత్య కేసుపై ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఈ ఘటనను ఖండించారు.