శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (17:35 IST)

చిరు 150వ సినిమాలో ఛాన్స్... అందుకే డ్యాన్స్ నేర్చుకుంటున్నా...!

అభిమానులు అనారోగ్యంతో ఉన్నారని తెలిస్తే మెగా హీరోలు హుటాహుటి వారి చెంతకు వెళ్లి ఓదార్చుతున్నారు. ఇటీవల ఒక క్యాన్సర్ బాధిత చిన్నారి తన అభిమాన హీరో చిరంజీవిని చూడాలని కోరుకున్నాడు. విషయం తెలుసుకున్న ఆయన స్వయంగా ఆస్పత్రికి వెళ్లి చిన్నారిని పరామర్శించారు. ఆ సమయంలో తన 150వ చిత్రంలో ఛాన్స్ ఇస్తానని బాలునికి చిరు హామీ కూడా ఇచ్చారు. 
 
ఈ విషయం గురించి క్యాన్సర్ బాధిత చిన్నారి సంగెం బాలు శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ తన అభిమాన హీరో చిరంజీవి తనను ఆస్పత్రిలో వచ్చి పరామర్శించారని తెలిపాడు. జనవరి 1న చిరంజీవికి ఫోన్ చేసి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపానన్నాడు. చిరంజీవితో డాన్స్ చేయాలని అంటే కోలుకున్న తర్వాత తన ఇంటికి రావచ్చు, తన 150వ చిత్రంలో తనకు అవకాశం ఇస్తానని చిరంజీవి తెలిపారని గుర్తుచేశాడు. అందుకోసం తానిప్పుడు డ్యాన్స్ నేర్చుకుంటున్నట్టు బాలు ఆనందంతో తెలిపాడు. ఇక చిరంజీవి చిన్నారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారో లేదో వేచి చాడాలి.