తాగొస్తే చీపురు తిరగెయ్యండి...రోజా

బుధవారం, 27 సెప్టెంబరు 2017 (18:08 IST)

Roja

ఎమ్మెల్యే.. అమ్మా.. మా భర్తలు తాగొచ్చి ఇళ్ళు గుళ్ళ చేస్తున్నారమ్మా.. పనిచేసిన డబ్బును తాగుడుకే ఖర్చు చేసేస్తున్నారమ్మా.. స్కూళ్ళ మధ్యలో, ఆలయాల మధ్యలోనే మద్యం దుకాణాలు పెట్టేశారమ్మా.. మీరే ఏదో ఒకటి చేయాలి.. అని పుత్తూరు నియోజకవర్గ ప్రజలు వైసీపీ ఎమ్మెల్యే రోజాకు విన్నవించుకున్నారు.
 
మద్యం షాపులతో ఇబ్బందులు పడుతున్నామని, పాఠశాలలు, కళాశాలల మధ్యలోనే మద్యం షాపులను నడిపేస్తున్నారని, దీంతో మందు బాబులు ఫ్లూటుగా మద్యం సేవించి మాతో అసభ్యంగా మాట్లాడుతున్నారని కొంతమంది విద్యార్థినులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. 
 
దీంతో రోజా సానుకూలంగా స్పందించి ఈ విషయంపై ఎక్సైజ్ శాఖ అధికారులతో మాట్లాడతాను. మీరు ధైర్యంగా ఉండండి. మద్యం షాపులను వేరే ప్రాంతానికి తరలించే బాధ్యత నాదని చెబుతూనే.. మీ భర్తలు తాగొస్తే మీరే దారిలో పెట్టుకోవాలి. వారికి బుద్ధి చెప్పండి అంటూ రోజా మహిళలకు సూచించారు. తాగొస్తే చీపురు తిరగెయ్యండి.. అప్పుడే వారికి తగిన బుద్ధి వస్తుందని రోజా అన్నారు.దీనిపై మరింత చదవండి :  
Roja Ysrcp Mla Belt Shops

Loading comments ...

తెలుగు వార్తలు

news

జయ ఊపిరితో ఉంటే ఆ పత్రాలపై వేలిముద్ర ఎందుకు వేశారు: హైకోర్టు ప్రశ్న

ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం మరోమారు వివాదాస్పదం కానుంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఏకే ...

news

మేము రంగంలోకి దిగితే మాత్రం వదిలిపెట్టేది లేదు: డొనాల్డ్ ట్రంప్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు ...

news

అటు కరుణ.. ఇటు నటరాజన్ ఆరోగ్యంపై వదంతులపై... తమిళనాడులో హైఅలెర్ట్

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. అటు కరుణానిధి, ఇటు వీకే శశికళ భర్త ...

news

సర్జికల్‌ స్ట్రైక్స్‌తో విరుచుకుపడిన ఇండియన్ ఆర్మీ...

ఇండియన్ ఆర్మీ మరోమారు సర్జికల్ స్ట్రైక్స్‌తో విరుచుకుపడింది. ఈ దఫా మాత్రం పాక్ ప్రేరేపిత ...