అలీ రాజకీయాల్లో వచ్చి.. కొత్త ఒరవడి సృష్టించాలి.. చంద్రబాబు

Last Updated: ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (09:51 IST)
ప్రముఖ హాస్యనటుడు అలీ రాజకీయాల్లో వచ్చి.. కొత్త రాజకీయ ఒరవడి సృష్టించాలి. ఆయన రాజకీయ ప్రవేశం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో సినీ నటుడు అలీ మరింత క్రియాశీలకంగా ఉండాలని కోరకుంటున్నట్టు చంద్రబాబు ఆకాంక్షించారు. 
 
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అలీ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. సినిమా జీవితంలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్టీఆర్ వచ్చాక ఆంధ్రులకు గుర్తింపు వచ్చిందన్నారు. 
 
తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటిచెప్పిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. అలాగే 40 ఏళ్ల సినీ జీవితంలో అలీ ఎంతో కష్టపడ్డారు. ఓ మంచి వ్యక్తిని అభినందించాలన్న ఆలోచనతో.. తాను కూడా భాగస్వామిని కావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి హాజరైనట్లు బాబు వ్యాఖ్యానించారు.దీనిపై మరింత చదవండి :