Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సొంత పేపర్.. ఛానెల్ లేకుండానే నంద్యాలలో గెలుపొందాం : చంద్రబాబు

మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (10:22 IST)

Widgets Magazine
chandrababu naidu

అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో సొంత పేపర్, ఛానెల్ లేకుండానే గెలుపొందామని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో జరిగిన పార్టీ వర్క్ షాపులో చంద్రబాబు మాట్లాడుతూ, సొంత పేపర్, ఛానెల్ లేకుండానే నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో విజయం సాధించాం. పేపర్, ఛానెల్ ఉన్న విపక్షం ఘోరంగా విఫలమైంది. గతంలో పార్టీకి దూరమైన వర్గాలు ఈ ఎన్నికల్లో టీడీపీకి దగ్గరవడమే అసలు విజయం. ఓటు బ్యాంకును కాపాడుకుందాం. కొత్త ఓటు బ్యాంకును సాధించుకోవడంతో గెలుపు సాధ్యమైందన్నారు. 
 
కులమతాలు, ప్రాంతాల వారీగా రెచ్చగొట్టేందుకు విపక్షం ప్రయత్నించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలు పెద్దపీట వేశారన్నారు. విజయవాడలో ఒక నాయకుడు మరో కులాన్ని రెచ్చగొట్టారని, దీంతో ఆ సామాజిక వర్గం వాళ్లు ధర్నా చేశారని అన్నారు. వైసీపీలో వాళ్లు వాళ్లూ కొట్టుకుని నగరంలో అశాంతిని రేకెత్తించారని చంద్రబాబు విమర్శించారు. 
 
ఈ సందర్భంగా ఆయన శిల్పా బ్రదర్స్‌పై సెటైర్లు కూడా వేశారు. తాము లేకపోలేదు.. నంద్యాలలో టీడీపీకి పొద్దుగడవదని శిల్పా బ్రదర్స్ అనుకున్నారనీ, వారికి దేవుడు సరైన గుణపాఠం చెప్పారన్నారు. పార్టీలో చేరికలపై టీడీపీ నేతలు విశాల దృక్ఫథంతో ఉండాలి. చేరికలతో పార్టీ బలపడాలి.. మీరూ బలపడాలి. ఎవరూ పార్టీలోకి రాకూడదనే ధోరణి మంచిది కాదని హితవు పలికారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నా స్వీటీ హనీతో ఒళ్లు మర్దన చేయించుకోవాలి.. పంపించండి ప్లీజ్... గుర్మీత్

తన దత్త పుత్రికగా చెప్పుకుంటున్న ప్రియాంక తనేజా అలియాస్ హనీప్రీత్ ఇన్సాన్‌ను తనతోపాటు ...

news

రేప్ చేసేటపుడు నువ్వు ఏడ్చావా.. గట్టిగా కేకలు వేస్తూ గోళ్లతో రక్కావా?

లైంగిక దాడి జరిగిన బాధితుల వద్ద న్యాయవాదులు అమానవీయ ప్రశ్నలు అడుగుతున్నట్టు ఓ స్వచ్ఛంద ...

news

జనం నుంచి జలంలోకి... హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం

దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్‌ మహాగణపతి మంగళవారం గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ...

news

తెలుగు టెక్కీకి "మిస్‌ ఇండియాసౌతాఫ్రికా" కిరీటం

ఇటీవల మిస్ ఇండియా - సౌతాఫ్రికా గాటెంగ్ టైటిల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తెలుగు టెక్కీ ...

Widgets Magazine