గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 18 అక్టోబరు 2021 (11:37 IST)

గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి

విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంద‌ర్శించారు. ఆశ్రమంలోని మరకత రాజరాజేశ్వరీ దేవిని ఆయ‌న  దర్శించుకున్నారు. మ‌ర‌క‌త రాజ‌రాజేశ్వ‌రి దేవిని రాజ్యాధికారానికి చిహ్నంగా భావిస్తారు. ఆమె ద‌ర్శ‌నం వ‌ల్ల అధికార పీఠంలో ఉన్న వారికి మంచి జ‌రుగుతుంద‌ని ప్ర‌తీతి. అందుకే రాజ‌రాజేశ్వ‌రి దేవిని ద‌ర్శించి, సీఎం జ‌గ‌న్ అనంతరం అవధూత దత్తపీఠాధిపతి స్వామి సచ్చిదానంద స్వామిజిని కలుసుకున్నారు. ముఖ్యమంత్రికి రాజరాజేశ్వరి  దేవి ఆలయ అర్చకులు, ఆశ్రమ పర్యవేక్షకులు అవధూత రమేష్, ఎగ్జిక్యూటివ్ ఏ.ఎస్.ఆర్.కె.ప్రసాద్,ట్రస్ట్ మెంబర్ జి.వి.ప్రసాద్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 
 
ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), వెలంపల్లి శ్రీనివాసరావు, సియం కార్యక్రమాల  సమన్వయ కర్త తలశిల రఘురాం, ఎమ్మెల్సీలు యండి.కరిమున్నిసా, టి.కల్పలత రెడ్డి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, పి.పార్థసారథి, కె.రక్షణానిది, కైలే అనిల్ కుమార్, జడ్పీ చైర్మన్ హారిక, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, కె డిసిసిబి చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.జి.వాణి మోహన్, సమాచార శాఖ కమిషనర్ టి. విజయకుమార్ రెడ్డి, నగర సిపి బత్తిన శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవిలత, సబ్ కలెక్టర్ జి.ఎస్. ఎస్.ప్రవీణ్ చంద్, దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ధర్మకర్తల మండల చైర్మన్ పైలా సోమినాయుడు, వైఎస్ఆర్ సిపి నాయకులు దేవినేని ఆవినాష్, భవకుమార్, యార్లగడ్డ వెంకట్రావు తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి వెంట యంపీ.విజయసాయిరెడ్డి, టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి దత్త పీఠానికి వచ్చారు.