శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (10:44 IST)

వైఎస్సార్ కళ్యాణమస్తు పథకానికి నిధుల విడుదల

jagan
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. పథకానికి మార్పులు చేసి కళ్యాణ మస్తు పథకంలో తొలి త్రైమాసికానికి లబ్దిదారులను ఎంపిక చేసిన ప్రభుత్వం నేడు వారికి ఖాతాల్లో ప్రభుత్వ సాయాన్ని జమ చేయనుంది.
 
అక్టోబర్‌ 2022-డిసెంబర్‌ 2022 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద రూ. 38.18 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేడు క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
 
పేద తల్లిదండ్రులకు తమ పిల్లల పెళ్లిళ్లు భారంగా కాకూడదనే ఉద్దేశంతో వారి వివాహాలను గౌరవప్రదంగా జరిపించేందుకు వారికి అండగా నిలుస్తోంది జగన్ సర్కార్.