వచ్చే జనవరి నాటికి రాష్ట్రంలో అందరికీ కరోనా వ్యాక్సిన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ సమస్య ఎప్పటికి తీరుతుందో తెలియడంలేదని, వచ్చే జనవరి నాటికి రాష్ట్రంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వగలమని భావిస్తున్నట్టు తెలిపారు.
కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే పరిష్కారం అని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి కొత్తగా 20 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్పి అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. 18 నుంచి 45 ఏళ్ల లోపు వయసు వారికి సెప్టెంబరు నుంచి టీకా ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. 2022 ఫిబ్రవరి వరకు అందరం జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.