గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (20:10 IST)

చంద్రబాబు పేరు చెప్తే వెన్నుపోటు పథకమే గుర్తుకొస్తుంది: జగన్

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అవమానించి టీడీపీ సభ్యులు అనుచితంగా ప్రవర్తించారని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. అలాగే టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్ అయ్యారు.
 
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సభకు ఎందుకు రావడం లేదో ఆయనకే తెలియడం లేదని సెటైర్ వేశారు. అసలు టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేసిన మేలు ఏంటని జగన్ ప్రశ్నించారు. 
 
చంద్రబాబు గత పాలనను ప్రజలు ఛీకొట్టారన్న జగన్.. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ప్రజా సంక్షేమ పథకం ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు పథకం గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు.
 
టీడీపీ పాలనలో ఎన్నికల వాగ్దానాలకు విలువేంటో.. తమ ప్రభుత్వంలో చేసిన వాగ్దానాలకు విలువేంటో స్పష్టంగా తెలుస్తోందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారని జగన్ గుర్తుచేశారు.