శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 27 ఆగస్టు 2021 (20:21 IST)

సిమ్లాలో టోపీ, షాల్‌తో ఏపీ సీఎం వై.ఎస్. జ‌గ‌న్!

నిత్యం స‌మావేశాలు, అధికారుల‌తో స‌మీక్ష‌ల‌తో తీర‌క‌లేకుండా ఉండే, ఏపీ సీఎం జ‌గ‌న్ నాలుగు రోజుల ఆట‌విడుపుగా హాలీడే స్పాట్స్ కి వెళ్ళారు. సిమ్లాలో ఆయ‌న‌కు అక్క‌డి సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో కుల్లు టోపీ, షాల్ క‌ప్పారు. దానితో ఏపీ సీఎం లుక్ మారిపోయింది. సిమ్లావాసిలా ఆయ‌న వ‌స్త్ర‌ధార‌ణ చూసి స్థానిక అధికారులు ముచ్చ‌ట‌ప‌డ్డారు. 
 
సిమ్లా డిజిపి సంజ‌య్ కుందు, ఎస్పీ డాక్ట‌ర్ మోనికా భ‌ట్నాగ‌ర్ ఏపీ సీఎంను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. వారు సిమ్లాకు వ‌చ్చిన సీఎం జ‌గ‌న్ ను సాద‌రంగా ఆహ్వానించి... త‌మ వెంట తెచ్చిన కుల్లు టోపీ  షాల్ ను జ‌గ‌న్ కు ధ‌రింప‌జేశారు.

దీనితోపాటు ఐకానిక్ ఇత్త‌డి ద‌శావ‌తార్ మెమెంటోని బ‌హూక‌రించారు. సిమ్లా పోలీసు అధికారుల సాద‌ర స్వాగ‌తానికి సీఎం జ‌గ‌న్ మురిసిపోయారు. వారికి ఏపీ ప్ర‌జ‌ల త‌ర‌ఫున అభినంద‌న‌లు తెలిపారు.