సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 జులై 2021 (07:55 IST)

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ప్యాసిజర్ రైళ్ళ సేవలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నుంచి ప్యాసిజర్ రైళ్ళ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కొవిడ్‌-19 తొలిదశ వ్యాప్తి ప్రారంభమైన తర్వాత నిలిచిపోయిన ప్యాసింజర్‌ రైళ్లను సోమవారం నుంచి తిరిగి పట్టాలెక్కించనున్నారు. 
 
ఇందులోభాగంగా, గుంటూరు జిల్లా మాచర్లలో వేకువజామున 5.30 గంటలకు బయలుదేరే రైలు ఉదయం 8.55 గంటలకు గుంటూరు చేరుకోనుంది. ఆ తర్వాత నరసాపూర్‌ నుంచి బయలుదేరి ఎక్స్‌ప్రెస్‌ రైలు 11.35 గంటలకు గుంటూరు చేరుకొంటుంది. 
 
అదేవిధంగా నడికుడి - కాచిగూడ - నడికుడి ప్యాసింజర్‌ రైలు సేవలు కూడా సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఆదివారం ట్రయల్‌రన్‌ కూడా నిర్వహించారు. కొవిడ్‌ దృష్ట్యా కొన్ని స్టేషన్లలో నిలుపుదల సౌకర్యం ఎత్తివేశారు. 
 
మాచర్ల - గుంటూరు మధ్యన రెంటచింతల, గురజాల, నడికుడి, పిడుగురాళ్ల, బెల్లంకొండ, రెడ్డిగూడెం, సత్తెనపల్లి, పెదకూరపాడు, బండారుపల్లిలో మాత్రమే నిలుపుదల ఉంటుంది. మిగతా స్టేషన్లలో రైళ్లు ఆగవు. కొన్ని రైళ్లకు గుంటూరు - విజయవాడ మార్గంలో పెదకాకాని హాల్ట్‌ని తొలగించారు.