మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2016 (10:53 IST)

ఖాకీ కర్కశత్వం : ఏటీఎంలో 2 కార్డులు వాడినందుకు చేయి విరగ్గొట్టారు

ఖాకీలు తమలోని కర్కశత్వాన్ని మరోమారు ప్రదర్శించారు. ఓ కానిస్టేబుల్ ప్రయోగించిన లాఠీ దెబ్బకు ఓ వ్యక్తి చేయి విరిగింది. ఇంతకీ అతను చేసిన నేరమేంటో తెలుసా? ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునేందుకు తన వద్ద ఉన్న ర

ఖాకీలు తమలోని కర్కశత్వాన్ని మరోమారు ప్రదర్శించారు. ఓ కానిస్టేబుల్ ప్రయోగించిన లాఠీ దెబ్బకు ఓ వ్యక్తి చేయి విరిగింది. ఇంతకీ అతను చేసిన నేరమేంటో తెలుసా? ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునేందుకు తన వద్ద ఉన్న రెండు కార్డులు వినియోగించడమే. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కర్నూలు జిల్లా చాగలమర్రిలో బుధవారం ఏటీఎం వద్ద క్యూలో నిలబడిన సుధాకర్‌ అనే వ్యక్తి తన వంతు రాగానే లోపలికి వెళ్లి రెండు కార్డులతో డబ్బులు డ్రా చేశాడు. దీంతో అతడు బయటకు రాగానే అక్కడ విధుల్లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ రాజా హుసేన్‌ అడ్డుకున్నాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగి హెడ్‌కానిస్టేబుల్‌ రాజా హుసేన్‌.. అతడి చెయ్యి పట్టుకొని తిప్పాడు. దీంతో సుధాకర్‌ చెయ్యి విరిగింది. ఈ ఘటన ఎస్పీ వరకూ వెళ్లడంతో ఆయన వెంటనే హెడ్‌కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు.