శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 2 జూన్ 2020 (09:04 IST)

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైల్వే స్టేషన్‌లోనే కరోనా పరీక్షలు

కరోనా వ్యాప్తికి అడ్డుకునేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైెళ్ల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించే వారిపై ప్రత్యేక దృష్టి సారించింది.

ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, చెన్నై నుంచి వచ్చే ప్రయాణికుకు రైల్వే స్టేషన్‌లోనే కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.

అనంతరం వారికి ఏడు రోజుల ప్రభుత్వ క్వారంటైన్‌, మిగతా ఏడు రోజుల హౌం క్వారంటైన్‌ విధించాలని నిర్ణయించింది. అయితే వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మినహాయింపు నిచ్చింది.

వారు 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌ పాటించాలని స్పష్టం చేసింది. మరోవైపు, ప్రభుత్వాధికారులు, వ్యాపారులు, వైద్యులు ప్రభుత్వ క్వారంటైన్‌కు వెళ్లాల్సిన అవసం లేకుండా మినహాయింపు ఇచ్చింది.