బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 23 మార్చి 2021 (10:42 IST)

రాజమండ్రిని వణికిస్తోన్న కరోనా

ఏపీలో కరోనా మహమ్మారి మరోసారి విజృభిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వాసులను కరోనా వణికిస్తోంది. రాజమంఢ్రి రూరల్ మండలం కాతేరులోని ఒక ప్రముఖ విద్యాసంస్థలో 160  మంది ఇంటర్ విద్యార్ధులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

హైస్కూల్, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే కేసులు వందల్లో పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంబంధిత విద్యాసంస్థలో సుమారు ఐదు వేలకుపైగా విద్యార్థులు ఉన్నారు. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

రాజమండ్రి అర్బన్‌తో పాటు రూరల్ మండలంలో పలు ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ  కరోనా కేసులు నమోదవుతున్నా అధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది.
 
1 నుంచి ఒంటిపూట బడులు 
కొవిడ్‌ మళ్లీ విజృంభిస్తుండడం, ఎండలు ఉధృతమవుతుండడంతో వచ్చేనెల 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయని డీఈవో ఎస్‌ అబ్రహం తెలిపారు.

ఉదయం 7.45 గంటలకు పాఠశాలలు ప్రారంభమవుతాయని, మధ్యాహ్నం 12.30 గంటలకు భోజనం విరామం తర్వాత పాఠశాల పనివేళలు ముగుస్తాయన్నారు.