సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (06:07 IST)

ఆరోగ్యశ్రీ పరిధిలోకి ‘కరోనా’.. ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

కొవిడ్‌-19(కరోనా వైరస్‌) కేసులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా చికిత్స అందించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

కరోనాకు సంబంధించి కొత్తగా 15 రకాల ప్రొసిజర్‌లను ఆరోగ్యశ్రీ ప్యాకేజీలోకి చేర్చినట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనా పరీక్షలు, వ్యాధి నిర్ధరణ, ఇతర వ్యాధులతో కలిపి వైద్యానికి ధరల ప్యాకేజీని నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

కనీస మొత్తంగా రూ.16 వేల నుంచి గరిష్ఠంగా రూ. 2 లక్షల 16 వేల వరకు చికిత్స ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో బాధితులను ఆసుపత్రుల్లో చేర్చుకోవడంతో పాటు చికిత్స అందించేలా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.