1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (16:28 IST)

బిగ్‌బాస్‌పై విరుచుకుపడిన నారాయణ - అదో బ్రోతల్ హౌస్ అంటూ ఫైర్

ప్రముఖ టీవీలీ ప్రసారమవుతూ కోట్లాది మంది ప్రేక్షకులను ఆలరిస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బిగ్‌బాస్ రియాల్టీ షోను ఒక బ్రోతల్ హౌస్‌తో పోల్చారు. పైగా, ఈ హౌస్‌లో జరిగే పనులను 24 గంటల పాటు ప్రత్యక్ష ప్రసారం చేయగలరా అంటూ ప్రశ్నించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, బిగ్‌బాస్‌ హౌస్‌లో యువతీయువకులను 105 రోజులు ఒకే గదిలో పెడుతున్నారన్నారు. లోపల ముద్దులు పెట్టుకుంటున్నారని, డేటింగ్‌ చేయిస్తున్నారని, ఇది సాంస్కృతిక దోపిడీ అని ఆరోపించారు. 
 
ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి ఏ సందేశం ఇస్తున్నారని నిలదీశారు. ఆ కార్యక్రమాన్ని 24 గంటలూ ప్రత్యక్ష ప్రసారం చేయగలరా? అని సవాల్‌ విసిరారు. కాగా, హైకోర్టు సూచనను పాటిస్తూ ట్యాంక్‌ బండ్‌లో వినాయక నిమజ్జనం చేయవద్దని నారాయణ అన్నారు.
 
సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం చెప్పడం మంచి నిర్ణయమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆన్‌లైన్‌లో టిక్కెట్ల బుకింగ్‌ను అమలు చేయాలని నారాయణ కోరారు.