Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లోకేష్ వెన్నుపోటు పొడుస్తాడేమోనని బాబుకు భయం... పవన్ మెరుపులా మాయం...

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (15:56 IST)

Widgets Magazine

రాజకీయ నాయకుల్లో అతికొద్దిమంది తాము అనుకున్నది అనుకున్నట్లుగా ముఖం మీదే చెప్పేస్తుంటారు. ఈ విషయంలో ఎవరు ఎలా నొచ్చుకున్నా వాళ్లు పట్టించుకోరు. అలాంటివారిలో సీపీఐ పార్టీకి చెందిన నారాయణ ఒకరు. కేంద్రం బడ్జెట్ కేటాయింపులపై నారాయణ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమరావతి కేపిటల్ గెయిన్స్ పేరుతో ఏపీని కేంద్రం దగా చేసిందని దుయ్యబట్టారు. బడ్జెట్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Lokesh-Babu-Pawan
 
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు చూసి జడుసుకున్నారని అన్నారు. భవిష్యత్తులో తన కొడుకు కూడా ములాయం సింగ్ యాదవ్‌కు అఖిలేష్ వెన్నుపోటు పొడిచినట్లు వ్యవహరిస్తాడేమోనన్న భయంతో లోకేష్ బాబుకు మంత్రి పదవి కట్టబెట్టబోతున్నారని విమర్శించారు.
 
ఇక జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ నిలకడలేని రాజకీయాలు చేస్తున్నారనీ, రాజకీయాల్లో ఆయన ఓ మెరుపులా మెరిసి మాయమవుతున్నాడని పేర్కొన్నారు. ఇలాంటి మెరుపులు ఎక్కువసేపు వుండవనీ, సమయం వచ్చినప్పుడు మెరిసి మాయమవుతుంటాయని అన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ మెరుపులా కాకుండా నిలకడగా రాజకీయాలు చేయాలనీ, లేదంటే భవిష్యత్తు వుండదని అన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మహిళ ముక్కులోకెళ్లిన బొద్దింక... ఏం చేసిందో తెలుసా?

సాధారణంగా ముక్కులోకి చిన్నపాటి దోమ వెళ్లినా బహు చిరాగ్గా ఉంటుంది. అలాంటిది ఏకంగా బొద్దింక ...

news

బాహుబలి అవతారంలో హరీష్ రావత్.. ఉత్తరాఖండ్‌ను ఎత్తేశాడు.. మోడీ అవాక్కయ్యారు..

దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అందులో ఉత్తరాఖండ్ కూడా ఒకటి. ...

news

సీల్డు కవర్.. సీఎం చాంబర్.. సేఫ్ లాకర్... మంత్రిగారి భవితవ్యం భద్రం.. ఎవరాయన?

ఓ సీల్డు కవర్. అందులే ఆ మంత్రివర్యుని భవితవ్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నిశితంగా పరిశీలించి ...

news

బీటెక్ పట్టభద్రుడి సోషల్ ఫ్రాడ్ ... 'క్లిక్కులు.. లైక్‌'ల పేరుతో రూ.3700 కోట్లు దోచేశాడు.. ఎలా?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ బీటెక్ పట్టభద్రుడు సోషల్ ఫ్రాడ్‌కు పాల్పడ్డాడు. క్లిక్కు, ...

Widgets Magazine