శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 14 ఆగస్టు 2021 (18:09 IST)

ఇది తాగండి.. చావండి.. అయ్యా సీఎం ఏంటిది..?

సిపిఐ రాష్ట్ర కార్యదర్సి రామక్రిష్ణ రాష్ట్రముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల ప్రాణాలతో సిఎం ఆడుకుంటున్నారంటూ మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను త్వరగా హరించే బ్రాండ్లను తయారుచేసి వాటితో కోట్ల రూపాయల ఆదాయాన్ని గడించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. 
 
తిరుపతిలోని ఒక వైన్ షాపులోకి వెళ్ళిన రామక్రిష్ణ ఆంధ్రా గోల్డ్ బ్రాండ్, గవర్నర్ బ్రాండ్‌లను చూపించారు. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారింది ఈ బ్రాండ్ల పరిస్థితి. బ్రాండ్లు అంటేనే భయపడాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రజలకు సిఎం తీసుకొచ్చారు. 
 
ఈ బ్రాండ్లు చవకే. కానీ తాగితే మాత్రం ఇక మెల్లమెల్లగా చావాల్సిందే. ప్రభుత్వ ఖజానాను నింపుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడే తప్ప ప్రజల ప్రాణాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి అవలంభిస్తున్న తీరు మరింత దారుణమంటూ మండిపడ్డారు సిపిఐ రామక్రిష్ణ.