Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమరావతిలో అకృత్యాలు: డ్రగ్స్, మందు, పబ్లిక్ రొమాన్స్, పార్టీలు...?

గురువారం, 10 ఆగస్టు 2017 (13:42 IST)

Widgets Magazine
amaravathi capital

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో డ్రగ్స్, బహిరంగ శృంగారం వంటి అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అమరావతి ప్రాంతంలోని 25కి మించిన గ్రామాల్లోని పంట పొలాలు ఖాళీగా వుండటంతో విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాల నుంచి రాత్రిపూట ఇక్కడకు చేరుకున్న యువత ఓవరాక్షన్ చేస్తోంది. మద్యం, గంజాయి, డ్రగ్స్ మత్తులో.. పబ్లిక్‌గా శృంగారానికి పాల్పడుతున్నారు. 
 
అంతటితో ఆగకుండా ఇదేంటని ప్రశ్నించే స్థానికులను బెదిరించడంతో పాటు.. దాడికి పాల్పడుతున్నారు. ఇటీవలే తాడేపల్లి ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు.. ఓ యువతిని వెంట తీసుకొచ్చారని.. కానిస్టేబుల్ వారిని అడ్డుకోగా.. సదరు యువతి రేప్ చేయబోయావంటూ.. కానిస్టేబుల్‌పైనే ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో ఆ కానిస్టేబుల్ గ్రామంలోకి వెళ్లి స్థానికులను వెంటబెట్టుకుని వచ్చి వారికి బుద్ధి చెప్పి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
మరో ఘటనలో గంజాయి తాగుతూ.. నలుగురు యువకులు అమ్మాయితో కనిపించారు. వీరిని ప్రశ్నించిన రైతుపై దాడిచేశారు. ఇదే తరహాలో ఉండవల్లి గుహల నుంచి సీఎం ఇంటికి వెళ్లే రహదారిలో మద్యం మత్తులో రోడ్డుపై బహిరంగ శృంగారం చేస్తున్న యువతీ, యువకుడిని సీఎం విధులు నిర్వహించడానికి వచ్చిన పోలీసు సిబ్బంది గట్టిగా మందలించి పంపించారు. 
 
ఇలాంటి ఘటనలే కాకుండా అర్థరాత్రి పూట ఆడా మగా తెలియకుండా పార్టీలు, బ్యాచ్‌ బ్యాచ్‌లుగా యువత విడిపోయి కొట్టుకోవడం వంటి అకృత్యాలు అమరావతిలో పెరిగిపోతున్నాయి. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు ఖాళీగా వున్న ప్రదేశాల్లో ఇలాంటి అసాంఘిక చర్యలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళ, దినకరన్‌కు షాక్‌.. పార్టీ నుంచి గెంటివేత?... పళనిస్వామి తీర్మానం

తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. అన్నాడీఎంకే ...

news

ఖతార్‌కు ఇక వీసా లేకుండా వెళ్ళొచ్చు తెలుసా?

సౌదీ అరేబియాతో పాటు ఏడు దేశాలు ఖతార్ దేశంలో సంబంధాలను తెగతెంపులు చేసుకున్న నేపథ్యంలో.. ...

news

ఉత్తర కొరియాపై దాడికి దేవుడు అనుమతిచ్చాడు.. ఇక యుద్ధమే తరువాయి?

ఉత్తర కొరియాపై దాడికి దేవుడు అనుమతిచ్చాడట. దీంతో ఆ దేశంపై బాంబుల వర్షం కురిపించేందుకు ...

news

బంగ్లాదేశ్ బాలికలతో వ్యభిచారం... ఎక్కడ?

హైదరాబాద్ నగరం ఇపుడు ఎన్నో నేరాలు ఘోరాలకు అడ్డాగా మారుతోంది. తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన ...

Widgets Magazine