సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 మార్చి 2023 (08:01 IST)

ఆస్పత్రి భవనాన్ని కూడా వదల్లేదు.. వైకాపా రంగులు వేసేశారు..

hospital
ఏపీలోని అధికార పార్టీ నేతలకు రంగుల పిచ్చిపట్టింది. అందుకే ప్రభుత్వ భవనాలను ఇష్టానుసారంగా తమ పార్టీ జెండాలోని మూడు రంగులు వేస్తున్నారు. ఈ రంగులు వేయొద్దని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం మొత్తుకున్నప్పటికీ వైకాపా నాయకులు మాత్రం పెడచెవిన పెట్టేస్తున్నారు. తాజాగా బాపట్లలోని ప్రాంతీయ ఆసుపత్రి భవనాలకు వైకాపా రంగులు వేయటం స్థానికంగా చర్చనీయాంశమైంది. 
 
ప్రాంతీయ ఆసుపత్రిని రూ.3.50 కోట్లతో ఆధునికీకరిస్తున్నారు. ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు పార్టీ పతాకాల రంగులు వేయరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా అధికారులు ఆసుపత్రి భవనాలకు అధికార పార్టీ పతాకం స్ఫురించేలా రంగులు వేయించటంపై రోగులు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
 
దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ సిద్ధార్థను ప్రశ్నించగా.. ఆసుపత్రిలో పనులు ఏపీ వైద్య సేవలు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు. సంస్థ ఉన్నతాధికారులు నిర్దేశించిన ప్రొటోకాల్‌ ప్రకారం ప్రాంతీయ వైద్యశాల భవనాలకు గుత్తేదారుతో రంగులు వేయించినట్లు ఇంజినీర్లు తెలిపారన్నారు.