శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 జనవరి 2015 (13:47 IST)

స్వైన్ ఫ్లూపై బండారుకు హామీ ఇచ్చిన మంత్రి జేపీ నడ్డా!

తెలంగాణలో స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తుల కోసం ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సాయంతో పాటు ప్రత్యేక వైద్య, సాంకేతిక సహాయం సైతం అందిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జెపి నడ్డా హామీ ఇచ్చారు. 
 
స్వైన్ ఫ్లూను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బండారు దత్తాత్రేయ కోరిన విధంగా ఉస్మానియా, గాంధీ తదితర ఆసుపత్రుల్లో స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సాయం అందిస్తామన్నారు. 
 
తెలంగాణకు మందులు పంపించటంతో పాటు అవసరమైన సాంకేతిక సాయం కూడా చేస్తున్నామన్నారు. స్వైన్‌ఫ్లూ మూలంగా తెలంగాణలో ఇంతవరకు 20మంది మరణించారని బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రికి చెప్పారు.