శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2023 (17:15 IST)

అమ్మ జైలులో.. బిడ్డ గేటు వద్ద.. ఏం తప్పు చేసిందని?

jail
కర్నూలు పాత నగరానికి చెందిన ఓ మహిళ చోరీ కేసులో పట్టుబడగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. కానీ ఆమె ఏం తప్పు చేసిందో తెలియని ఆమె కుమార్తె జైలు వద్ద నిలిచిపోయింది. అమ్మను చూడాలని, మాట్లాడాలని వెక్కివెక్కి ఏడుస్తున్న ఆ బిడ్డను చూసిన వాళ్లందరి కళ్లలో నీళ్లు తిరిగాయి.  
 
ఆమె చేసిన నేరం గురించి ఆలోచించే వయస్సు కూడా ఆ బాలికకు లేదు. కేవలం అమ్మ దూరమైందన్న ఆవేదన ఆ చిన్నారిని జైలు వరకు వచ్చేలా చేసింది. స్థానికుల విజ్ఞప్తితో జైలు అధికారులు ఆ తల్లిని బయటికి పిలిపించి కుమార్తెను కలిపించారు. కొద్దిసేపు చిన్నారిని లోపలికి తీసుకెళ్లింది. ఆ తర్వాత బంధువుల ద్వారా ఆ బిడ్డను జైలు అధికారులు ఇంటికి పంపించివేశారు.