కన్నకూతురిపై లైంగిక దాడి.. భర్త బుద్ధి తెలిసి భార్య కాపాడింది.. ఎక్కడ?

కన్నకూతురిపైనే కన్నతండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణాజిల్లా అవనిగడ్డలో చోటుచేసుకుంది.

Last Updated: బుధవారం, 10 అక్టోబరు 2018 (14:15 IST)
కన్నకూతురిపైనే కన్నతండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణాజిల్లా అవనిగడ్డలో చోటుచేసుకుంది. వయోబేధాలు లేకుండా మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో నాలుగేళ్ల కుమార్తెపై ఓ కామాంధుడైన తండ్రి కన్నేశాడు. ఇంతకీ ఆ కామాంధుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పాఠాలు చెప్పాల్సిన గురువే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామానికి చెందిన కోటినాగేశ్వరరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. అయితే.. భర్త వక్రబుద్ధి తెలుసుకున్న భార్య ఇప్పటికే పిల్లల్ని తీసుకుని అతనికి దూరంగా వుంటోంది. రెండు రోజుల క్రితం పిల్లలపై ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ.. భార్య వద్దకు వచ్చిన కోటి నాగేశ్వరరావు.. నాలుగేళ్ల కూతురిని లైంగికంగా వేధించాడు. 
 
కూతురనే కనికరం లేకుండా అసభ్యకరంగా ప్రవర్తించాడు. కానీ భర్త బుద్ధి తెలుసుకున్న భార్య వెంటనే కూతురిని భర్త నుంచి రక్షించుకోగలిగింది. వెంటనే భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :