Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నంద్యాల ఉప ఎన్నికలు.. సీన్లోకి బ్రహ్మానందరెడ్డి.. టీడీపీ అభ్యర్థి రేసులో భూమా చిన్నకుమార్తె కూడా?

శుక్రవారం, 17 మార్చి 2017 (11:55 IST)

Widgets Magazine
Bhuma Nagireddy

దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో నంద్యాల ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. వైసీపీ కూడా బరిలో దిగుతామని ప్రకటించడంతో బలమైన అభ్యర్థఇని బరిలో నిలిపేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ముందుగా భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే రేసులో భూమా బ్రహ్మానందరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. 
 
నిజానికి శోభా నాగిరెడ్డి మరణించిన సమయంలోను ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసేందుకు బ్రహ్మానందరెడ్డి రెడీ అయ్యారు. కానీ భూమా పెద్ద కుమార్తె అఖిలప్రియకు ఆ స్థానం కేటాయించడంతో బ్రహ్మానందరెడ్డి వ్యాపారాల్లోనే మునిగిపోయారు. ప్రస్తుతం ఆళ్లగడ్డలో భూమా కుటుంబానికి చెందని జగత్ డైరీ వ్యవహారాలను బ్రహ్మానంద రెడ్డి చూసుకుంటున్న తరుణంలో.. నంద్యాల స్థానంలో ఆయన్ని బరిలోకి దించే విషయమై టీడీపీ రంగం సిద్ధం చేస్తోంది. 
 
ఇకపోతే.. వైసీపీ నేత, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి బ్రహ్మానందరెడ్డి అల్లుడు కావడం విశేషం. బ్రహ్మానందరెడ్డి గనుక ఎన్నికల బరిలో నిలిస్తే.. కాటసాని వర్గం నుంచి కూడా ఆయనకు మద్దతు లభించే అవకాశముందని టీడీపీ ప్లాన్ వేస్తోంది. సానుభూతి పరంగా భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తెను బరిలోకి దించాలని కూడా టీడీపీ కసరత్తు చేస్తోంది. మరి భూమా నాగిరెడ్డి అకాల మరణంతో జరుగనున్న నంద్యాల ఉప ఎన్నికల్లో బ్రహ్మానంద రెడ్డి లేదా భూమా చిన్న కుమార్తె.. వీరిద్దరిలో టీడీపీ ఎవరికి ఛాన్స్ ఇస్తుందో తెలియాలంటే వేచి చూడాలి.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పవన్ కళ్యాణ్ చెప్పిన మాట నిజమేనా? ఉత్తరాది అహంకారం... మోదీ అలా ఎందుకు చేస్తున్నారు?

జనసేన పార్టీ చీఫ్ ఎప్పుడు మాట్లాడినా ఉత్తరాది, దక్షిణాది అంటూ మాట్లాడుతుంటారు. ఉత్తరాది ...

news

కదిలే రైలులో కన్నతండ్రి ముందే.. అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్.. గుజరాత్‌లో ఘోరం..

నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా గతంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయినా కామాంధుల ...

news

వివాహేతర సంబంధం.. కన్నబిడ్డ మర్మాంగంపై వాతలు పెట్టి.. మూత్రం తాగించిన తల్లి..

భర్తకు దూరమైంది. ఆపై వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇందుకు కన్నకొడుకు అడ్డుగా ఉన్నాడని ...

news

సెక్స్ రాకెట్.. కాల్ గర్ల్స్ బ్లాక్ మెయిల్.. రూ.30లక్షలు గోవిందా.. అంతా ఫేస్‌బుక్ తంటా!

అందమైన అమ్మాయి కోసం ఓ వ్యాపారి నష్టపోయాడు. కాల్ గర్ల్స్ బ్లాక్‌మెయిల్‌కు గురయ్యాడు. ...

Widgets Magazine