మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 5 మార్చి 2022 (15:15 IST)

బంగాళాఖాతంలో వాయుగుండం: ఆ మూడు జిల్లాలకు వర్షాలు

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీ జిల్లాల్లో వర్షాలు కురువనున్నాయి. చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై వున్న ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర మధ్య తీరం దాటే అవకాశం వున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

 
వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. కాగా తీర ప్రాంతంలో తగు చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేసారు.