గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 నవంబరు 2020 (14:27 IST)

వైకాపా రాజకీయ పార్టీయేనా? ఢిల్లీ హైకోర్టు ప్రశ్న!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపా గుర్తింపుపై ఢిల్లీ హైకోర్టు కీలక ప్రశ్న సంధించింది. అసలు వైకాపా రాజకీయ పార్టీయేనా? అంటూ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి అంటూ ప్రశ్న సంధించారు. 
 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై వైకాపా ఢిల్లీ హైకోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. 
 
ఈ కేసు విచారణ సమయంలో వైకాపా దాఖలు చేసిన అఫిడవిట్‌కు సమాధానం ఇవ్వడానికి సమయం కావాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయమూర్తి తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 29కి వాయిదా వేశారు.
 
ఈ అంశంపై పిటిషనరు బాషా మీడియాతో మాట్లాడుతూ, ట్రేడ్‌ మార్కు చట్టం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్‌ అనే పేరును వాడుకునే హక్కు ఉందని ఆ పార్టీ అఫిడవిట్‌లో పేర్కొన్నట్టు తెలిపారు. దీంతో వైసీపీ రాజకీయ పార్టీయేనా? అని న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారని చెప్పారు. అఫిడవిట్‌ను మీడియాకు అందించడానికి న్యాయమూర్తి నిరాకరించారని తెలిపారు.