సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 7 జనవరి 2019 (17:05 IST)

ఏపీకి షాకిచ్చిన కేంద్రం : గణతంత్ర వేడుకల్లో ఏపీ శకటానికి నో ప్లేస్

దేశగణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ప్రతి యేడాది దేశ రాజధాని ఢిల్లీలో రక్షణ శాఖ పేరెడ్ నిర్వహిస్తుంది. ఇందులో అన్ని రాష్ట్రాలకు చెందిన శకటాలు ప్రదర్శనగా వెళతాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పాల్గొన్న శకటం ప్రతి యేడాది మన్నలు అందుకుంది. కానీ, ఈ నెల 26వ తేదీన జరుగనున్న వేడుకలకు మాత్రం ఏపీ శకటానికి చోటుదక్కలేదు.
 
నిజానికి ప్రతి యేటా ఈ వేడుకల కోసం ఆయా రాష్ట్రాలు ఎలాంటి నమూనాలు పంపుతున్నాయన్న దానిపై ముందుగానే రక్షణ శాఖకు వివరాలు తెలియజేయాల్సి ఉంది. ఆర్మీ అధికారులు డిజైన్‌ను ఆమోదించిన తర్వాత శకటాన్ని సిద్ధం చేసి పంపిస్తారు. నిపుణుల కమిటి తుది పరిశీలన తర్వాత అంతా బాగుంది అనుకుంటే వాటికి పేరేడ్‌లో అవకాశం కల్పించేది లేదనిదీ స్పష్టంచేస్తారు. 
 
కానీ, ఏపీకి సంబంధించిన శకటం డిజైన్‌ ఈ దఫా కూడా అందరి మన్నలు అందుకుంది. కానీ, చోటు దక్కలేదు. ఇది ఏపీ సర్కారును షాక్‌కు గురిచేసింది. ఆఖరు నిమిషంలో ఎందుకిలా జరిగిందో తమకు అర్థం కావడంలేదని ఏపీ భవన్ అధికారులు వాపోతున్నారు. ఏపీ సర్కారు గాంధీ కొండ, పొందూరు ఖద్దరు, పల్లిపాడు సత్యాగ్రహం అంశాలతో డ్రాయింగ్ తీసి పంపించింది. వాటిని త్రీడీ మోడల్‌ను, సంగీతాన్ని కూడా జతచేసింది. అంతా బాగుంది అనుకున్న సమయంలో ఏపీ డిజైన్‌ను రక్షణ శాఖ వర్గాలు ఆమోదించలేదు.