గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 16 నవంబరు 2024 (13:12 IST)

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో శివాజీలా డిప్యూటీ సీఎం పవన్ ఫ్లెక్సీలు

Pawan flexes like Chhatrapati Shivaji
కర్టెసి-ట్విట్టర్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరుగనున్నాయి. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఈ నేపధ్యంలో ఆ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి తరపున ప్రచారం చేసేందుకు భాజపా సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను ఆహ్వానించారు. ఐతే అక్కడ పవన్ పర్యటించే ప్రాంతాల్లో ఛత్రపతి శివాజీ గెటప్ తో పవన్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఫ్యాన్స్ తమదైన శైలిలో జనసేనానికి ఆహ్వానం పలుకుతున్నారు.
 
పవన్ 16, 17 తేదీల్లో రెండు బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. 16న నాందేడ్ జిల్లాలోని డెగ్లూరులోను, లాతూర్ లోనూ ప్రసంగిస్తారు. 17న చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ సభలో, అదేరోజు సాయంత్రం పుణె కంటోన్మెంట్ నియోజకవర్గం పరధిలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. మొత్తమ్మీద ఆయన 5 సభలు, 2 రోడ్ షోలలో పాల్గొంటారు.